Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేరుగా కాళహస్తికి వెళ్లి సాయిని పరామర్శించారు.. అక్కడ నుండి ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని స్వయంగా అంజు యాదవ్ పై ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్.. అయితే, తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీకి ఆ సమయంలో వెన్నుదన్నుగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త అయిన కొట్టే సాయికి.. మంచి పోస్ట్ ఇచ్చారు.. ఏకంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్.. దీంతో సాయిని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి వరించింది.. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది..
Read Also: India Private Gold Mine: పక్క రాష్ట్రంలో.. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని..