Tirupati Murders Mystery: తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అటవీప్రాంతంలో డెడ్ బాడీలు దొరకడంతో వారిని ఎందుకు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పాకాల పోలీసులు తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికి ఒక మహిళ, పురుషుడి డెడ్ బాడలకు పోస్టుమార్టం చేయగా.. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. వారిలో మృతుడు తంజావూర్ కు చెందిన కలై సెల్వన్ గా అదే ప్రదేశంలో లభించిన మహిళాతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె ఇద్దరు కుమార్తెల వర్షిణి,హర్షిణిగా గుర్తించారు పోలీసులు… అయితే, గత జూలైలో జయమాలిని, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జయమాలిని భర్త వెంకటేశన్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కువైట్‌లో పని చేస్తున్న వెంకటేశన్, జూలైలో ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సీడీఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించింది భర్తను అదుపులోకి తీసుకున్నారు..
Read Also: Anil Chauhan: “నెపోటిజం” లేనిది ఒక్క సైన్యం లోనే: డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్
అయితే ఇప్పటికి వారు ఎలా మృతి చెందారనే విషయంపై మిస్టరీ వీడటం లేదు. ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య పాల్పడ్డారా అన్నది ఇప్పటికి తెలియడం లేదు. జయమాల భర్త వెంకటేష్ ను విచారణ అనంతరం పోలీసులు పంపేశారు. ఆమెకు ముగ్గురు సోదరులు, ఓ సోదరి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారికి సైతం ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఐతే ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. మృతుల్లో చిన్నపిల్లల శరీరాలపై మాత్రమే గాయాలున్నట్లు గుర్తించారు. జయమాల ఒంటిపై గాయాలేవీ లేవు. ఆమె మెడ ఎముక ఉన్న తీరును బట్టి ఉరి ద్వారా మృతి చెందాక కిందకు దింపినట్లు భావిస్తున్నారు. కళైసెల్వన్ రాత్రిళ్లు సరిగా నిద్రపోయే వాడు కాదని, మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకునేవాడని బంధువుల ద్వారా తెలుస్తోంది. అత్యధిక సమయం యూట్యూబ్లో నేరాలకు సంబం ధించిన వీడియోలు చూసేవాడని సమాచారం.
ఇక వరుసకు అన్న చెల్లెలు గా ఉన్న ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉండేవారని ఇద్దరు కూడా కోటి రూపాయలకు పైగా ఫైనాన్స్ చేస్తున్నట్లు స్థానికల నుండి పోలీసులు సమాచారం సేకరించారు… రోజులు పాటు ఫైనాన్స్ వ్యాపారం బాగానే సాగిన అటు తర్వాత రికవరీ ఆశించినంత స్థాయిలో కాకపోవడంతోనే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు… దానికి తోడు ఉన్న కాస్త డబ్బులను జల్సాలకు ఖర్చు పెట్టడంతో భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక జయమాలిని పలుమార్లు ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎటువంటి వారికి చెప్పుకొని బాధపడినట్లుగా తెలుస్తోంది.. ఆ కారణంతో ఏమైనా ఇద్దరు పిల్లల్ని చంపివేసి అటు తర్వాత ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి… అయితే ఇవన్నీ రెండు మూడు రకాల వెర్షన్లు గానే ఉన్నప్పటికీ అసలు నిజం ఏంటన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రావడం లేదు…ఇక మృతదేహాల వద్ద దొరికిన రెండు సెల్ ఫోన్ లతో పాటు మృతురాలి భర్త వెంకటేష్ సెల్ నంబరును పోలీసులు తీసుకున్నారు. వీటికి సంబంధించి కాల్ డేటా విశ్లేషిస్తే ఏవైనా ఆధారాలు లభిస్తాయని పోలీసులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చాకే ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.. ఇలా నలుగురు మృతి చెందడం సరైనటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు తిరుపతి జిల్లా పోలీసులు…