కరోనాతో ఇండియా మొత్తం ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఇటీవల నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు అంటూ మీరు పంపిణీ చేసేందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆనందయ్య నేను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని అన్నారు. అంతేకాకుండా తన మందు ఏ జబ్బుకైనా ఇమ్యూనిటిని మాత్రమే పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.…
కరోనా మందుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య.. ఇప్పుడు కలకలం సృష్టిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా మందు తయారు చేసినట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొంతమంది ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నానికి రావడం.. స్థానికులు మందు పంపిణీని అడ్డుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.. మరోవైపు.. ఇప్పుడు ఆనందయ్యకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.. ఆనందయ్యకు తాజాగా నోటీసులు జారీ చేశారు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్… కరోనా మందు పంపిణీకి…
కరోనా వైరస్‌కు మందు తయారుచేసిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆనందయ్య స్వయంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆనందయ్య సోమవారం నాడు విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. Read Also: మంచి మనసు చాటుకున్న టీమిండియా కోచ్ ద్రవిడ్ అనంతరం ఆయన…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్…
మందు పంపిణీపై ఎట్టకేలకు ఆనందయ్య స్పందించారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ…
ఆనందయ్య మందు పంపిణీ చాలా గందరగోళంగా తయారైంది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని…
ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి మందు తయారీ జరుగనున్నది. దీంతో ఈ రోజు కలెక్టర్‌తో ఆనందయ్య సమావేశం అయ్యారు. మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరూ రవొద్దని, ఆన్‌లైన్ లో మందు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంపిణీకి మరో 5 రోజుల సమయం పడుతుందని అందరికీ తప్పకుండా మందు పంపిణీ…
ఆనందయ్య మందుకు అనుమతి ఇస్తారా? లేదా? అంటూ గత కొంతకాలంగా కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. మొత్తానికి ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. కంట్లో వేసే చుక్కుల మందుకు అనుమతి నిరాకరించింది.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే, కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున.. ప్రస్తుతానికి ఆ మందుకు అనుమతి నిరాకరించింది. ఇక, ఇప్పటి…
ఆనందయ్య మందును ఈ నెల 21 వ తేదీన ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. మందుపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నివేదికలు అందిన తరువాత, పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామరడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్కలు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే బతికి ఉంటాయి. మూడు నెలలపాటు మాత్రమే బతికి ఉంటాయి. ఈ మొక్కలు మరో నెల…
కరోనా మందు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు ఎంత పేరు తెచ్చిందో.. అన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.. ఆయన తయారు చేస్తున్న కరోనా మందుపై తేల్చేపనిలో ఉన్న ప్రభుత్వం.. అదే సమయంలో.. ఆయనకు భద్రత కల్పించి.. ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం.. ఆయనకు కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే ఉంటానని చెప్పారు..…