అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయినట్లు చూపించారు.. అదేరోజు జిల్లాలో 200 మందికి పైగా కోవిడ్ తో చనిపోయారని ఆరోపించారు.. ప్రస్తుతం ప్రజలు కరోనా గురించి భయపడటం లేదన్న ఆయన.. అమెరికాలో కరోనాతో చనిపోయిన…
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే ఆనందయ్యకు వ్యతిరేకంగా కొంత.. అనుకూలంగా చాలా వరకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుండగా.. వెంటనే ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. కరోనా బాధితులకు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పేర్కొన్నాడు..…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టడంతో.. మందు తయారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది… అనంతపురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు…
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు వలన ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయూష్ కమిషనర్ రాములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మరోసారి మందును ఆనందయ్య తయారు చేయనున్నారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆయూష్, ఐసీఎంఆర్ నివేదికల ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం…
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత…
అసలు కంటే.. కొసరు ఎక్కువట.. అసలు మందు ఇప్పటికే ఆపేశారు.. కానీ, ఇదే ఆ మందు అంటూ బ్లాక్ మార్కెట్‌లో సొమ్ము చేసుకోవడానికి బయల్దేరారు కేటుగాళ్లు.. విషయానికి వస్తే.. కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య.. ఇప్పుడు.. వార్తా కథనాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి.. మందులు ఏం వాడుతున్నారు దగ్గర నుంచి ఎలా తయారు చేశారు.. పంపిణీపై చర్చ సాగుతోంది.. ఇక, దీనిపై పూర్తిస్థాయిలో తేల్చేందుకు ఆయూష్ డిపార్ట్‌మెంట్‌కు కూడా రంగంలోకి…
ఇప్పుడు చర్చ మొత్తం కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందుపైనే.. కరోనా రోగుల నమ్మకం, విశ్వాసం ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందన్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామన్న ఆయన.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని అందినకాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు, ఇక, ఫార్మా కంపెనీల దందా చెప్పాల్సిన పనేలేదు.. ఈ తరుణంలో.. ఉచితంగా కరోనావైరస్‌కు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.. పదులు, వందల్లో వచ్చేవారి సంఖ్య ఏకంగా వేలకు పెరిగిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేయాల్సిన పరిస్థితి. మరోవైపు.. ఆ మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలోపడిపోయారు. ఆయుష్‌తో పాటు ఐసీఎంఆర్ కూడా రంగంలోకి దిగింది. కృష్ణపట్నంకు…