నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే కరోనా మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.. కొందరు మందుకు తీసుకోవడానికి వెళ్లకపోయినా.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును తిరిగి ప్రారంభించారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు.. దీంతో.. వందలాది మంది…
ఆనందయ్య మెడిసిన్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. పది రోజుల క్రితం వరకు ఆనందయ్య మెడిసిన్‌ను అనేకమందికి ఉచితంగా సరఫరా చేశారు. అయితే, శాస్త్రీయత అంశంపై ప్రస్తుతం సీసీఆర్ఏఎస్ పరిశోధనలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆనందయ్య కనిపించడం లేదని, ఆయన ఆచూకీ చెప్పానలి, ఆనందయ్యను వదిలిపెట్టాలని కృష్ణపట్నం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకి లేదని గ్రామస్తులు ఆంధోళన చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఉన్నారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందయ్యను వదిలిపెట్టాలని డిమాండ్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనందయ్య పిటీషన్ దాఖలు చేశారు. గత 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్‌గా ఉన్నానని, ఆనందయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కోవిడ్ 19 కి చేస్తున్నామని, మందు తయారీ, పంపిణీ చేయడంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, నెల్లూరు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, డిఎంహెచ్ఓ, ఆయుష్ కమీషనర్‌లను చేర్చారు. ఈ కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అనందయ్య…
ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్…
ఆనందయ్య మెడిసిన్‌పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టులో సీవీఆర్ ఫౌండేషన్ బిల్టింగ్‌లో అనధికారికంగా వేల మందికి మందు తయారు చేస్తున్నారని, ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని ఆయుష్ కమీషనర్, స్టేట్ హెల్త్ ప్రకటించినా ఎందుకు మందును పంపిణీ చేయడంలేదని టీడీపీ నేత సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆనందయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలనే ఇలా చేస్తున్నారని, అదే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయి ఉంటే ఇన్ని రోజులు అక్రమంగా ఆయన్ను నిర్భందించేవారా…
ఆనందయ్య తయారు చేసిన మందు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆనందయ్య మందు కరోనాకు పని చేస్తుందని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన మందుకు డిమాండ్ పెరిగింది. ఇక ఈ మందుపై ప్రస్తుతం విజయవాడ ఆయుర్వేద పరిశోధనసంస్థ, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల పరిశోధన చేస్తున్నాయి. 570 మంది నుంచి వివరాలు సేకరించి పరిశోధన చేశారు. ఈ నివేదికను సీసీఆర్ఏఎస్‌కు సమర్పించారు. సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతులు వస్తే ఆనందయ్య మందు తయారు…
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు స్వీకరించిన వారి వివరాలను నెల్లూరు జిల్లా యంత్రాంగం పరిశోధనా కేంద్రాలకు అందించింది. తిరుపతి ఆయుర్వేద కళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివరాలు తెలియకపోవడంతో అదనంగా తిరుపతి కేంద్రానికి మరో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు. అయితే, మందు పంపిణీ సమయంలో…
ఆనందయ్య మందుకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతం ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలలో పరిశోధన కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య దగ్గర మెడిసిన్ తీసుకున్న వారికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు వైద్యలు. నిన్నటి రోజున 190 మందికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అయితే, ఫోన్ ద్వారా వివరాలు సేకరించే సమయంలో వైద్యులకు సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్యకార్యకర్తల నెంబర్లు ఇచ్చినట్టు వైద్యుల…
ఆనందయ్య మందు తయారీపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఇప్పటికే ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు మందుపై పరిశోధన ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుండి వివరాలను సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పరిశోధనకు సంబందించిన రిపోర్టులు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి మందు తయారీ మరింత ఆలస్యం కావొచ్చని…