కరోనాతో ఇండియా మొత్తం ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఇటీవల నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు అంటూ మీరు పంపిణీ చేసేందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆనందయ్య నేను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని అన్నారు.
అంతేకాకుండా తన మందు ఏ జబ్బుకైనా ఇమ్యూనిటిని మాత్రమే పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ నోటీస్‌కు పూర్తి వివరాలతో సమాధానమిస్తానని ఆయన వెల్లడించారు. ఉచితంగానే మందు ఇస్తున్నానని, తనపై గ్రామపంచాయతీలో తీర్మనం చేయడం బాధకరమని ఆయన అన్నారు. అధికారులత ఆదేశాలతో మందు పంపిణీని నిలిపేశానని, ఈ విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు .