ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి నుంచి మందు తయారీ జరుగనున్నది. దీంతో ఈ రోజు కలెక్టర్‌తో ఆనందయ్య సమావేశం అయ్యారు. మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరూ రవొద్దని, ఆన్‌లైన్ లో మందు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంపిణీకి మరో 5 రోజుల సమయం పడుతుందని అందరికీ తప్పకుండా మందు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందును వేగంగా తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.