నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్ది మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు నూతన అధ్యాయనికి శ్రీకారం చుట్టారు.. అధికార పార్టీకి డబుల్ డిజిటల్ కూడా దక్కకపోవడాన్ని చూస్తే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం అవుతుందన్నారు. ఎన్నికల వరకూ బాధలు భరించిన ప్రజలు నిర్ణయాత్మకంగా వ్యవహారించారు.. ప్రజలు తమ మనోభవాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.. ప్రజల మనోభావాన్ని అర్ధం చేసుకోవడంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయం సాధించారని చెప్పారు. గత ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలతో ప్రజలు విసిగిపోయారు.. టీడీపీ కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని చంద్రబాబు లక్ష్యాలను సాధిస్తారు.. ఒకటి రెండు సంవత్సరాలలోనే అమరావతిని రాజధానిగా ప్రపంచానికి మోడల్ గా చంద్రబాబు తీర్చి దిద్దుతారు అని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
Read Also: Akira Nandan: చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్న అకిరా నందన్
అన్ని సంక్షేమ పథకాలతో సుపరిపాలన అందిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు ప్రజలు మూడు దశాబ్దాలుగా తరువాత టీడీపీకి అవకాశం కల్పించారు.. మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గానికి చేసిన సేవలకు పట్టం కట్టారు.. ఇది ప్రజలు, టీడీపీ కార్యకర్తల శ్రమ ఫలితం.. యూనివర్సిటీల డబ్బులు ఖర్చు చేసి ప్రమాణ స్వీకారానికి దుర్వినియోగం చేశారు.. అలాంటి అధికారులను విచారణ చేసి శిక్షిస్తాము అని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.