అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని పేర్కొన్న ఆయన.. భారతీయ జనతా పార్టీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నానన్నారు..
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సమావేశం అదన్న ఆయన.. సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు.
కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం పైన అమిత్ షా పై కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ గారిని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పీఎం కిసాన్ గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఎవరిది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ…