తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.. అన్ని పార్టీల అగ్రనేతలు మునుగోడు బాట పడుతున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇలా అగ్ర నేతలంతా మునుగోడు బాట పడుతున్నారు
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారన్నారు.