Horrible Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్నా సరిహద్దులో ఆగివున్న రెండు బస్సులను ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
Mallikarjun Kharge: 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భావసారుప్యం ఉన్న పార్టీలతో చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ అనేక సార్లు దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేను, ఇతర వ్యక్తులు నన్ను తాకలేరని అన్నారని, ప్రజాస్వామ్యవాది ఎవరూ ఇలా అనరని, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, నియంత కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు ప్రజలతో ఎన్నుకయ్యారు, వారే మీకు…
Sanjay Raut: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను కోల్పోవడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం న్యాయం కాదని.. వ్యాపారం ఒప్పందం అని దీని కోసం ఏకంగా 6 నెలల్లో రూ. 2000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. రూ. 2000 కోట్ల కేవలం ప్రాథమిక అంచనా అని.. ఇది వందశాతం నిజమని, అధికార పక్షానికి దగ్గరగా ఉండే ఓ బిల్డర్ ఈ విషయాలను…
Amit Shah: శివసేన పార్టీ, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ను సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తీవ్రంగా స్పందించింది. మోదీకి మహారాష్ట్రలో ముఖం చెల్లకే బాలా సాహెబ్ ఠాక్రే ముఖాన్ని వాడుకునేందుకు పార్టీ పేరు, ఎన్నికల చిహ్నాన్ని దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏక్ నాథ్ షిండేను దొంగగా అభివర్ణించారు.
కేంద్రం చొరవతో అట్టడుగు స్థాయి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని పేర్కొంటూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి, దేశ ప్రజలకు పోటీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఆ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ పొందగా, వారిలో 41 మంది మహిళలు ఉండగా.. 195 మందిలో 166 మంది ఐపీఎస్ అధికారులు, వారిలో 37 మంది మహిళలు.
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఎన్నికల యాక్షన్ ప్లాన్ అమలును బీజేపీ జాతీయ నాయకత్వం షురూ చేసింది. ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు జరపున్నారు.