Minister KTR Speech At Rajanna Sircilla Party Event: ఒకప్పుడు కరువుమెట్ట పంటలున్న సిరిసిల్ల ఇప్పుడు కొనసీమలాగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఇదని, ఇది కేసీఆర్ దార్శనికత అని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బిఅర్ఎస్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు లేకుండా తాము లేమని అన్నారు. తెలంగాణ సాధించేందుకు అన్నం తినో, అటుకులు బుక్కో గులాబీదండు కార్యకర్తలు రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు అమలుకు కొత్త ప్రణాళికలు వేశామని, కేసీఆర్ ఇచ్చే రూ.10 లక్షలను పదింతలు చేసే శక్తి ఉన్నోళ్లను వెతికామని అన్నారు. ఇవాళ దళిత బంధు కింద తాను రైస్ మిల్లును ప్రారంభించానని, ఆ మిల్లులో బీహార్ వాళ్ళను చూశాని, మన రాష్ట్రం తెలంగాణ బిడ్డలకే కాకుండా బీహార్ బిడ్డలకు కూడా బువ్వ పెడుతోందని అన్నారు.
MLA Ramesh Babu: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయిన పడవలు.. ఎమ్మెల్యే ఎద్దేవా
దళితులు, గిరిజనులు చేతగాని వాళ్ళు కాదు.. చేవ ఉన్నోళ్లు అని ఈ దళితబంధు తో నిరూపిస్తామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. పదవులు వస్తుంటాయ్ పోతుంటాయని.. కానీ పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామో చెప్పుకునేందుకు ఒక పని అయినా ఉండాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీ అంటే గంగదేవిపల్లి, అంకపూర్ మాత్రమే ఉండేవని.. కానీ ఇప్పుడు తెలంగాణలో అన్ని అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో 20 ఉత్తమ పంచాయతీల లిస్ట్‌లో 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయన్నారు. 140 మున్సిపాలిటీలు ఉంటే.. వాటిల్లో 27 మున్సిపాలిటీలు జాతీయ అవార్డులు సాధించాయని తెలియజేశారు. రాజకీయాల్లో నేల విడిచి సాము చేయవద్దని సూచించారు. 60 లక్షల గులాబీ కుటుంబ సభ్యులని కలిసి.. వారితో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కాగా గెలవాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఆ సీట్లు గెలిచేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Game Changer: ఎవరిని మోసం చేస్తున్నారు.. బ్రూస్ లీ పోస్టర్ వేసి కొత్త పోస్టర్ అంటారేంటి..?
అంతకుముందు.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో రైస్ మిల్‌ను ప్రారంభించిన కేటీఆర్, ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ధ్వజమెత్తారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన.. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా జరిపామన్నారు. విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు అడుగుతున్నారని.. ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామని కేటీఆర్ ప్రశ్నించారు. త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు. పాత ఖైదీగా వ్యవహరించడం మాని.. భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.