CM Jagan Meets Amit Shah: అర్ధరాత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Meets Amit Shah: హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.. రాత్రి 10.45 గంటల సమయంలో అమిత్‌షాతో సమావేశం అయ్యారు సీఎం జగన్.. దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్రవిభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముందస్తుగా పదివేల కోట్లు మంజూరు చేయాలని అమిత్‌షాను కోరినట్టుగా పేర్కొన్నారు.. మొత్తంగా ఈ నెలలోనే సీఎం ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది..
అమిత్‌షాకు సీఎం జగన్ నివేదించిన అంశాలు ఇవే..
* రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను.
* పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.
* అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతింది. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
* పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను.
* తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అదిస్తే జాప్యాన్ని నివారించవచ్చు.
* 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
* రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.
* తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.
* జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, రూ.56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడంవల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్రం ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్ దాదాపు 3లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టిపెట్టాలని కోరుతున్నాను.
* రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి.ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని కేంద్ర హోంశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?