Amit Shah Congratulates Team RRR For Bagging the Best Original Song Award at the 95th Academy Awards: 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలిచినందుకు గాను.. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి కేంద్రం హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక దినమని కొనియాడారు. నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకొని.. సరికొత్త చరిత్ర సృష్టించిందని ట్విటర్ మాధ్యమంగా పేర్కొన్నారు. ‘‘భారతీయ చిత్రసీమకు ఇదో చారిత్రాత్మక దినం. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ పాట భారతీయుల నోళ్లలో నానడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేస్తూ.. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను అమిత్ షా ట్యాగ్ చేశారు.
KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు
అంతకుముందు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆర్ఆర్ఆర్ యూనిట్‌ని అభినందించారు. ఇది దేశం గర్వించదగిన సందర్భమని చెప్పుకొచ్చారు. ఈ విజయాన్ని అసాధారణమైనదిగా పేర్కొన్న మోడీ.. నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని, ఇది కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోయే పాటగా నిలుస్తుందని తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. ‘నాటు నాటు’ ఆస్కార్స్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగిరికి నామినేట్ అయిన తొలి తెలుగు పాట. రిహానా, లేడీ గాగా వంటి వారిని సైతం వెనక్కు నెట్టి.. ఈ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్‌ని సొంతం చేసుకుంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పురస్కారాన్ని ఆస్కార్ వేదికపై అందుకున్నారు. నాటు నాటుకు ఆస్కార్ రావడమే ఆలస్యం.. వరల్డ్‌వైడ్‌గా ఉన్న భారతీయులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా మాధ్యమంగా వ్యక్తపరిచారు.
Talasani srinivas yadav: ఇదంతా రాజమౌళి వల్లే.. త్వరలో RRR టీమ్‌ను..