Amit Shah: ఆస్కార్ వచ్చాక అమిత్‌షాని కలిసిన రామ్ చరణ్, చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Chiranjeevi Meets Amit Shah: అమెరికాలో ఆస్కార్ వేడుకలను ఘనంగా జరుపుకున్న అనంతరం ఈరోజు ఉదయం భారత్‌కి తిరిగొచ్చిన రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశాడు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ముగ్గురు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా.. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకోవడం పట్ల అమిత్ షా అభినందించారు. సినిమాకు సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారు. ఇటు.. తండ్రితో కలిసి అమిత్‌షాను రామ్ చరణ్ కలవగా.. అటు తారక్ ‘ధమ్కీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు.. జూ. ఎన్టీఆర్‌ను అమిత్ షా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కలుసుకున్న విషయం అందరికీ తెలిసిందే! ఆ సమయంలో వీళ్లిద్దరు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
మరోవైపు.. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో రామ్ చరణ్ పాల్గొనున్నాడు. అందుకే.. నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయి, అక్కడే ఉండిపోయాడు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధాని మోడీతో కలిసి చరణ్ ఈ వేదికను పంచుకోనున్నాడు. కాగా.. మార్చి 12వ తేదీన జరిగిన ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు’ పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ దక్కిన విషయం విదితమే! దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. లాస్‌ఏంజెల్స్‌లో ఈ అవార్డ్‌ని కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత మొదటగా తారక్ భారత్‌కు తిరిగిరాగా.. మార్చి 17వ తేదీన టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది.
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!