ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి హస్తిన చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ భేటీ అవుతారు. అలాగే, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, విభజన హామీల అమలు, ఇతర అంశాలపై మోడీ, అమిత్ షాతో జగన్ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడంతో రాజధానులపై కోర్టుల్లోనూ సానుకూల పరిస్ధితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం వైపు నుంచి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ మరోసారి ప్రధాని, హోంమంత్రిని కోరనున్నట్లు సమాచారం.
Also Read:secunderabad: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి
ఈ ఏడాది జులైలో విశాఖ నుంచి పాలన కొనసాగించాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని మోదీ, అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రాభివృద్ధిపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తగ్గిపోవడం, రెవెన్యూ లోటు పెరుగుతుండటం, వెనుక బడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వీటిలో కొన్నయినా అమలు చేసేలా కేంద్రంపై జగన్ ఒత్తిడి పెంచాని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read:Rain Alert: బయటకు వెళ్తున్నారా?.. జర భద్రం!
కాగా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ లో, కేబినెట్ భేటీలో విశాఖ నుంచి పరిపాలన జరుగుతుందని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాజధాని అంశంపై కూడా కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. విశాఖ నుంచి పాలన జరుగుతుందని సమాచారం ఇవ్వబోతున్నారనే చర్చ నడుస్తుంది.