Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగం అయిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై చైనా తన గుప్పిట్లోకి తీసుకోవాలని అనుకుంటోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్ అరుణాచల్ విషయంలో చైనా వైఖరిపై దృఢంగా వ్యవహరిస్తోంది. ఇటీవల డ్రాగన్ కంట్రీ అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లను మార్చింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేర్లు మార్చినంత మాత్రాన అరుణాల్ మీదైపోదంటూ ఘాటుగానే బదులిచ్చింది.
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు బీజేపీ పెద్దలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశం కానున్నట్లు సమాచారం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్…
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆధారంగా రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు వేయడంపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పేర్కొన్నారు. కౌశాంబి మహోత్సవ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల సర్వతోముఖ సంక్షేమం కోసం 2024లో మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కొత్త చూస్తున్నామని కొందరు ముస్లిం నేతలు ప్రసంశలు కురిపించారు. ముస్లిం మత పెద్దల ప్రతినిధి బృందం నిన్న అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంది. శ్రీరామనవమి తర్వాత మతపరమైన హింస, ద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారు.
Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బాట పట్టారు.. ఇప్పటికే హస్తిన చేరుకున్న ఆయన.. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కలవబోతున్నారు.. ప్రతిపక్షాలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల ప్రకటించిన పవన్.. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్లారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్య హస్తిన వెళ్లివచ్చారు.. తన పర్యటనలో కేంద్ర…
Kapil Sibal: రామ నమవి రోజున, తర్వాత బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మతఘర్షణలు చెలరేగాయి. చాలా వరకు ఇళ్లు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ హింసాకాండపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆదివారం ప్రశ్నించారు మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కారణం కాకూడని ఆయన అన్నారు.