తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
Amit Shah criticizes Congress: ‘‘ మోదీ చనిపోవాలి’’, ‘‘ మోదీ సమాధిని తవ్వుతాం’’ అంటూ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయని, అయితే ఇవన్నీ పనిచేయవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన దీర్ఘాయువుతో ఉండాలని 130 కోట్ల మంది ప్రార్థిస్తున్నారని అన్నారు.
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది.
Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని హెచ్చరించారు. శనివారం జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మహాగటబంధన్ ర్యాలీని ఉద్దేశిస్తూ వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని కులం, మతం పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకం అని, మేము 2024 లోక్ సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచివేస్తాం అని అన్నారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మహాగటబంధన్ కూటమి వెనక ప్రధాని ఆశలు ఉన్నాయని నితీష్ కుమార్ ను ఎద్దేవా చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని పదవి కోసమే కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో చేతులు కలిపారని ఆరోపించారు. తన ప్రధాని కలను నిరవేర్చుకునేందుకే.. బీజేపీతో…