Joe Biden: ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: ప్రిగోజిన్‌పై అమెరికా అధ్యక్షులు జొ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ ఇటీవల.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనదైన శైలిలో స్పందించారు. ఆయనపై విషప్రయోగం జరగొచ్చేమోనంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రిగోజిన్(Prigozhin) చేసిన తిరుగుబాటు, ఆ తర్వాత పరిణామాలను ఉద్దేశించి బైడెన్ ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ‘ప్రిగోజిన్ ఎక్కడున్నారో అమెరికాకు తెలీదు. అతడి స్థానంలో నేనుంటే.. నేను తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నా మెనూపై ఓ కన్నేసి ఉంచుతాను’ అంటూ ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘ఇక సరదా మాటలన్నీ పక్కన పెడితే.. రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ కచ్చితంగా తెలీదని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.
Read also: Robbery in Jagtial: మీ కక్కుర్తి పాడుగాను.. ఇలా కూడా దొంగతనం చేస్తారా..!
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్ యద్ధంలో పోరాడుతోన్న వాగ్నర్ గ్రూప్.. జూన్ 24న తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా రొస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది. దీని తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్- ప్రిగోజిన్ మధ్య చర్చలు జరిగాయి. తర్వాత పుతిన్ ఓ పత్రికతో మాట్లాడుతూ.. ‘వాగ్నర్ పీఎంసీ అనేది లేదు. మా చట్టాలు ప్రైవేటు సైన్యాలకు అనుమతి ఇవ్వవు. వాస్తవానికి వాగ్నర్ గ్రూపు ఉంది. కానీ చట్టం దృష్టిలో మాత్రం అటువంటి సంస్థ లేదు. దీనిని చట్టపరం చేయడం ఓ ప్రత్యేకమైన విషయం. ఆ విషయాన్ని స్టేట్ డూమా చర్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వాగ్నర్ బాధ్యతల నుంచి ప్రిగోజిన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చని గతంలోనూ ఊహాగానాలు వినిపించాయి. ఆ మధ్య పుతిన్‌ను ఎదిరించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవానీ సహా కొందరిపై విషప్రయోగం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బైడెన్ ఈ విధంగా స్పందించారని భావించాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?