31 Dead After Winter Storm In US: అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
క్రిస్మస్ పండుగ వేళ భయంకరమైన మంచు తుఫాను అగ్రరాజ్యమైన అమెరికాను ముంచెత్తింది. యునైటెడ్ స్టేట్స్లో 3,500 కిలోమీటర్ల పొడవున మంచుతుఫాను విశ్వరూపం చూపుతోంది. తూర్పు అమెరికాలో పరిస్థితి భయంకరంగా ఉంది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి.
Joe Biden Nominates Indian-American Richard Verma For Top Diplomatic Post: భారతీయ అమెరికన్లు వ్యాపారాలు, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అమెరికా సిలికాన్ వ్యాలీని భారత టెక్కీలు ఏలుతున్నారు. నాసా మొదలుకుని వైద్యం, వ్యాపారం ఇలా పలు రంగాల్లో భారతీయులు, భారత-అమెరికన్లు సత్తా చాటుతున్నారు. బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాలకు భారతీయ మూలాలు ఉన్న వారు ప్రధానులుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే అమెరికాలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ అధికారంలో ఉన్న భారతీయ- అమెరికన్లకు కీలక పదవులు…
Gujarat Man Falls To Death From US Border: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుడు ప్రమాదవశాత్తు మరణించాడు. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ తాలూకా నివాసి అయిన బ్రిజ్ కుమార్ యాదవ్ మెక్సికో-అమెరికా సరిహద్దు దాటుతూ మరణించినట్లు అమెరికన్ మీడియా వార్త కథనాలను ప్రచురించింది. ‘ట్రంప్ వాల్’గా పిలువబడే భారీ గోడ అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉంది. ఈ గోడను దాటి బ్రిజ్ కుమార్ కుటుంబం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసింది.…
Heavy snowfall in America : అమెరికాలో మంచు భారీగా కురుస్తుంది. న్యూయార్క్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పెద్దగా మంచు పడుతుంది. పశ్చిమ న్యూయార్క్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
CM Jagan: వచ్చే ఏడాది అమెరికాలో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాటా తెలుగు మహాసభలకు ఏపీ సీఎం జగన్‌కు ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడితో పాటు పలువురు నాటా సభ్యులు సోమవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలంటూ ఆయన్ను ఆహ్వానించారు. నాటా తెలుగు మహాసభలు 2023 జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డల్హాస్‌లో జరగనున్నాయి. ఈ…
భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్‌లో జరిగిన గాలా ఈవెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు.
U19 T20 World Cup: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ వచ్చే నెల 14న దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అండర్ 19 మహిళల ప్రపంచకప్ కోసం అమెరికా 15 మంది సభ్యులతో తన టీమ్‌ను ప్రకటించింది. అయితే అమెరికా టీమ్‌ను చూసిన వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా టీమ్‌లో అందరూ భారత సంతతి అమ్మాయిలే ఉన్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ టీమ్‌లో కెప్టెన్ గీతిక కొడాలి, వైస్ కెప్టెన్…
గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత భద్రతా దళాలు అమెరికాలో తయారు చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు ఆదివారం తెలిపారు. నవంబర్ 26న మిర్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయని ఒక అధికారి తెలిపారు.
సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో వరుసగా మూడోసారి పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచినట్లు యూఎస్ థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తాజాగా అంచనా వేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ద్వారా పెరుగుతున్న హింసతో సహా పలు భద్రత, మానవ హక్కుల సవాళ్లను పాకిస్థాన్ ఎదుర్కొంటుందని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తన 28 పేజీల నివేదికలో పేర్కొంది.