US President: జోబైడెన్‌పై అభిశంసన తీర్మానానికి రిపబ్లికన్లు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు. సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించారు. వైట్ హౌస్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఉందని జిమ్ బ్యాంక్స్ ఆరోపించారు.
Read Also: MadhyaPradesh: ఇన్‌స్పెక్టర్ కూతురు స్నానం చేస్తుండగా.. సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకు వీడియో తీశాడు
Also Read
గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఈ అభిశంసనకు మద్దతు పలికారు. బైడెన్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తరపున పాల్గొన్నారు. బైడెన్ ఒక నేరస్తుడు.. అతను మనల్ని మూడో ప్రపంచ యుద్ధంలోకి నడిపిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బైడెన్‌లు చేసిన నేరాలకు రుజువు ఉందంటూ ప్రతినిధి మార్జోరీ టేలర్ గ్రీన్ విమర్శించారు. అభిశంసన తీర్మానానికి 218 రిపబ్లికన్ ఓట్లు అవసరం.. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
Read Also: Naveen Patnaik: నవీన్ పట్నాయక్ కొత్త రికార్డు.. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తి
మరో ప్రతినిధి ఆండీ బార్ ఇలా అన్నాడు.. బైడెన్ రాజీ పడ్డాడు అనడానికి ఇదే అసలైన సాక్ష్యం.. బైడెన్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని అతడు పేర్కొన్నారు. వైట్ హౌస్ అధికారులు రిపబ్లికన్ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఆ పత్రాలు నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచురితమయ్యాయని వారు తెలిపారు. కాంగ్రెస్ రిపబ్లికన్లు నిజానిజాలతో సంబంధం లేకుండా అధ్యక్షుడు బైడన్‌పై ఆరోపణలు చేయడం సరైనది కాదని వెల్లడించారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!