రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అధిక ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో టెన్నిస్ ప్రియులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్రంప్ వస్తుండడంతో ఆట ఆలస్యంగా మొదలైంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవంగా ట్రంప్ వస్తున్నట్లు ఎవరికీ తెలియలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు.
తనను గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా సానుకూల పరిణామాలను అభినందించారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
వైట్‌హౌస్ వేదికగా దిగ్గజ టెక్ సీఈవోలందరికీ ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. విందులో ట్రంప్ దంపతులిద్దరూ హాజరయ్యారు. విందులో సీఈవోలతో ట్రంప్ ప్రత్యేకంగా ఒక్కొక్కరితో సంభాషించారు. సొంత దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు.
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఇటీవల అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పట్లోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులంతా ‘రాడికల్ లెఫ్ట్ గ్రూప్’ అంటూ ముద్ర వేశారు.