Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన
- గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన ట్రంప్
- అడ్డుకుని తీరుతామన్న డెన్మార్క్
- లేటెస్ట్‌గా ట్రంప్ కుమారుడికి కొత్త ప్రతిపాదన
- సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై కన్నుపడింది. ఎలాగైనా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రతిపాదన వైరల్‌గా మారింది. గ్రీన్‌లాండ్ కావాలంటే ఎలాంటి యుద్ధం చేయకుండా సొంతం చేసుకునే ప్రతిపాదన వైరల్ అవుతోంది. ట్రంప్ కుమారుడైన బారన్ ట్రంప్‌కు డెన్మార్క్ యువరాణి ఇస్లాబెల్లాతో వివాహం జరిపిస్తే.. కట్నంగా గ్రీన్‌లాండ్‌ను సొంతంగా చేసుకోవచ్చని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివాహ ప్రతిపాదన వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Trump: వెనిజులా చమురు విక్రయంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఏ దేశాలకు సేల్ అంటే..!
ప్రస్తుతం ఈ ప్రతిపాదన లక్షలాది మందిని ఆకర్షించింది. అంతేకాకుండా జోకులు, మీమ్స్, తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కొంత మంది ఈ ప్రతిపాదనను సమర్థించగా.. ఇంకొందరు అసంబద్ధం అంటూ కొట్టిపారేశారు. మరికొందరు అభ్యంతరకంగా ఉందంటూ విమర్శించారు.
గ్రీన్‌లాండ్ చరిత్ర..
18వ శతాబ్దం నుంచి గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఇది డానిష్ నియంత్రణలో ఉంది. ఈ ద్వీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం లేదా? స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని హెచ్చరించింది. అయినప్పటికీ 2019లోనే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనను ట్రంప్ మొదట ప్రతిపాదించారు. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ ప్రతిపాదనను ట్రంప్ రెట్టింపు చేశారు. కచ్చితంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు యూరోపియన్ మిత్రదేశాలు, నాటో భాగస్వాములను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.
ఇసాబెల్లా..
ఇసాబెల్లా.. డెన్మార్క్ యువరాణి. 2025లో 18 ఏళ్లు నిండాయి. 2007, ఏప్రిల్ 21న జన్మించింది. డానిష్ సింహానం వరుసలో రెండో స్థానంలో ఉంది. రాజు ఫ్రెడరిక్-క్వీన్ మేరీ పెద్ద కుమార్తె. ప్రస్తుతం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తోంది. ఇటీవల ఫొటోషూట్‌తో వార్తల్లో నిలిచారు.
BREAKING –
MAGA is saying that Barron Trump should marry Princess Isabella of Denmark so that Greenland would be given to US as a dоwry pic.twitter.com/ZjuSJeKjQr
— Global UPDATES (@GlobalUpdates24) January 8, 2026
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..