వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో కిడ్నాప్ తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మదురో మాదిరిగా పుతిన్‌ను కూడా భవిష్యత్‌లో కిడ్నాప్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. ఎప్పుడూ గొప్ప సంబంధం ఉంటుందని చెప్పారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో పుతిన్‌తో విసిగిపోయినట్లు తెలిపారు. ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపానని.. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. ఇది చాలా క్లిష్టమైందని తెలిసిందన్నారు. అయినా కూడా పుతిన్‌పై సైనిక చర్యలు చేపట్టనని స్పష్టం చేశారు. అయితే యుద్ధం ముగింపు విషయంలో మాత్రం రష్యాపై ఒత్తిడి కొనసాగిస్తానని తెలిపారు. ఈ రెండు దేశాల యుద్ధం వల్ల అనేక మంది చనిపోయారన్నారు.
ఇది కూడా చదవండి: Trump-Nicolas Maduro: కిడ్నాప్‌కు మందు మదురోకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయి? చివరికేమైంది?
ఇదిలా ఉంటే మదురో కిడ్నాప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థించారు. ఈ సందర్భంగా పుతిన్‌ను ఉద్దేశిస్తూ ‘‘నియంత’’ ఇలాగే వ్యవహరిస్తే తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పుతిన్‌ను కూడా మదురోలాగా కిడ్నాప్ చేస్తారా? అని విలేకర్లు ప్రశ్నించారు. పుతిన్ విషయంలో అలాంటి అవసరత రాదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్‌లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు