ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. నగరాలు రక్తసిక్తంగా మారాయి. వందలాది మంది నిరసనకారుల శవాలు రోడ్లపై పడి ఉన్నాయి. దాదాపు వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గత డిసెంబర్ 28న మొదలైన నిరసనలు.. నెమ్మది.. నెమ్మదిగా తీవ్ర రూపం దాల్చి రణరంగంగా మారింది. ఆందోళనకారులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుదాడిలో ఇప్పటి వరకు 600 మంది చనిపోయినట్లుగా చెబుతున్నా.. కానీ ఆ సంఖ్య 5 వేల మంది వరకు చనిపోయి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకో వైపు ఇరాన్ అంతటా అంధకారం అలుముకుంది. ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. నగదు కొరత ఏర్పడింది. అన్ని రకాలుగా ప్రజా రవాణా ఆగిపోయింది. అన్ని నగరాల్లో ఆందోళనలు ఉధృతం కావడంతో భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి. ఇంకోవైపు అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం కూడా చేతులెత్తేసినట్లుగా సమాచారం. దీంతో ఆయన పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సహచరులు, కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాస్కోనే సురక్షితమైన ప్రాంతంగా ఖమేనీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇది కూాడా చదవండి: Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న
గత కొద్దిరోజులుగా ద్రవ్యోల్బణం కారణంగా ఇరానీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు లేక నరక యాతన పడుతున్నారు. దీంతో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై అణిచివేత కారణంగానే ఇంత పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నియంతకు మరణశిక్ష విధించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అంటే ఖమేనీపై ఏ రేంజ్‌లో కోపం ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది.
ఇది కూాడా చదవండి: Rahul Gandhi: తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. విజయ్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్‌గాంధీ
తాజా పరిణామాలను బట్టి చూస్తే ప్రాణాలకు ముప్పు కలగక ముందే మాస్కోకు వెళ్లిపోతే మంచిదని నిఘా వర్గాల హెచ్చరికతో ఖమేనీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అయితే రష్యాలో ఎలాంటి భద్రతా ఉంటుందన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ముస్లిం దేశాల్లో సరైన మద్దతు లేకపోవడం వల్లే ఖమేనీ మాస్కోను ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అగ్ర రాజ్యం అమెరికా కూడా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. నిరసనకారులపై ప్రతాపం చూపిస్తే అమెరికా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులు ఇరాన్ విడిచిపెట్టాలని ట్రంప్ సూచించారు. దీంతో అమెరికా నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు రెజా పహ్లావి ఇరాన్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.