ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. గత డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు తాజాగా తీవ్ర రూపం దాల్చాయి. ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిరసనకారులు ఆందోళనలు మరింత తీవ్రతరం చేశారు. ఇంకోవైపు భద్రతా దళాలు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు 538 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయాలు పాలయ్యారు.
ఇది కూడా చదవండి: JK: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భద్రతా దళాలు
ఇంకోవైపు ఈ నిరసనలు అగ్ర రాజ్యానికి పాకాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా లాస్‌ఏంజిల్స్‌లో పెద్ద ఎత్తున రెజా ప్రహ్లవి మద్దతుదారులు నిరసన తెలిపారు. రోడ్లపైకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. దీంతో రెజా ప్రహ్లవి వ్యతిరేక సంస్థ ముజాహిదీన్-ఎ-ఖల్క్ (ఎంఈకే) స్టిక్కర్‌తో ఉన్న ట్రక్కు నిరసనకారులపైకి దూసుకొచ్చింది. ఈ ట్రక్కుపై ‘‘నో షా’’ అనే నినాదం రాసి ఉన్నాయి. ఇక ట్రక్కు దాడిలో అనేక మంది నిరసనకారులు గాయపడడంతో డ్రైవర్‌ను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: ‘‘ఆలస్యం చేయకుండా మాతో డీల్ కుదుర్చుకోండి’’.. మరో దేశానికి ట్రంప్ వార్నింగ్..
BREAKING: Truck drives into crowd in Los Angeles, California pic.twitter.com/tVnUlfbyxx
— Rapid Report (@RapidReport2025) January 11, 2026
WATCH: Protesters clash with police in Los Angeles after man drove truck into crowd https://t.co/21TtAZ6f1c pic.twitter.com/wuNdF9k2GA
— Rapid Report (@RapidReport2025) January 12, 2026
WATCH: Furious crowd pulls truck driver from his vehicle, smashes it after he mows into protesters in Los Angeles, California, at least 1 injured https://t.co/SFdDDOSP6j pic.twitter.com/MpMcGJXX9z
— Rapid Report (@RapidReport2025) January 12, 2026