దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఒక ముస్లిం మహిళా నేతకు అగ్ర రాజ్యంలో గౌరవం లభించింది. అమెరికాలోని ముస్లింలు అధికంగా నివసించే నగరంలోని ఒక ప్రధాన రహదారికి ఖలీదా జియా పేరు పెట్టారు.
ఖలీదా జియా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. మూడు సార్లు ప్రధానిగా చేశారు. డిసెంబర్ 30న చనిపోయారు. అయితే అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఖలీదా జియా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ గౌరవార్థం అమెరికా రాష్ట్రమైన మిచిగాన్‌లోని ఒక నగరంలోని ప్రధాన రహదారికి ఖలీదా జియా స్ట్రీట్‌గా మార్చే ప్రతిపాదనను అధికారికంగా ఆమోదించింది. ‘కార్పెంటర్ స్ట్రీట్’ ఉన్న పేరును ‘ఖలేదా జియా స్ట్రీట్’గా మార్చారు. ఈ ప్రతిపాదనను హామ్‌ట్రామ్క్ నగర కౌన్సిల్ ఆమోదించిందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తెలిపింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మూలానికి చెందిన నలుగురు కౌన్సిలర్లు హామ్‌ట్రామ్క్ నగర కౌన్సిల్‌లో పనిచేస్తున్నారు. దీంతో ఖలీదా జియా పేరు పెట్టడానికి పరిస్థితులు సానుకూలించాయి.
ఇది కూడా చదవండి: Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఫోన్ చేయలేదు.. వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడంపై అమెరికా కొత్త వాదన
బంగ్లాదేశ్ నాయకుడిని అమెరికా గడ్డపై సత్కరించడం ఇదే మొదటిసారి కాదు. చికాగోలోని ఒక వీధికి గతంలో దివంగత అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ పేరు పెట్టారు. మిచిగాన్‌లోని వేన్ కౌంటీలోని హామ్‌ట్రామ్క్ అనే నగరం రాష్ట్రంలో అత్యంత జనసాంద్రత కలిగిన మునిసిపాలిటీ. ఇది పూర్తిగా ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన అమెరికాలో మొదటి నగరం. 2013లో హామ్‌ట్రామ్క్ ముస్లిం-మెజారిటీ నగరంగా మారింది. 2022లో హామ్‌ట్రామ్క్ పూర్తిగా ముస్లిం నగర మండలి కలిగిన నగరంగా అవతరించింది.