వైద్య రంగంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గతంలో ఎన్నడూ కని, విని ఎరుగని విధంగా ఓ మహిళ కడుపులో రెండు గర్భాలు ఉన్నాయి. ఉండటాన్ని గమనించిన డాక్టర్లు షాక్ అయ్యారు. రెండు గర్భాల్లో ఒకేసారి ఇద్దరు శిశువులు పెరగడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.. రెండు గర్భాల్లో ఇద్దరు శిశువులు పెరగడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. గర్భశయాలు ఉన్నా కూడా ఆ రెండింటిలోనూ శిశువులు పెరగడం అరుదుగా జరుగుతుందని వైద్యులు స్పష్టం చేశారు.. ఇలా ఉండటం మాత్రమే కాదు.. ఆ మహిళ డెలివరీ టైం చాలా రిస్క్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు..ఈ అరుదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. దక్షిణ అమెరికాలో కెల్సీ హాట్చర్, కాలేబ్ అనే దంపతులు అలాబామా రాష్ట్రంలో నివశిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా కెల్సీ హాట్చర్ మరోసారి గర్భం దాల్చగా ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ రెండు గర్భాల్లో ఇద్దరు శిశువుల ఉన్నారని, ఆ మహిళకు ఇది వరకూ వైద్యులు తెలిపారు.. ఆ రెండు గర్భాల్లో రెండు పిండాలు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు..
మాములుగా గర్భాశయంలో ఇద్దరు శిశువులు ఉంటే కవలలు అంటారని, అయితే రెండు గర్భాశయాల్లో ఇద్దరు శిశువులు వేర్వేరుగా ఉండటం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిండాలు పెరుగుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు.. రెండు గర్భాశయాల్లో పెరుగుతున్న వారు ఆరోగ్యం ఉన్నట్లు చెప్పలేమని, వైద్యపరంగా ఇటువంటి కేసులు హై రిస్క్ అని వైద్యులు చెబుతున్నారు.. డెలివరీ సమయంలో కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు..