Former US President Donald Trump Sister Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ట్రంప్ సోదరి, రిటైర్డ్ యుఎస్ ఫెడరల్ జడ్జి మేరియన్ ట్రంప్ బారీ (86) సోమవారం మృతి చెందారు. న్యూయార్క్ నగరం అప్పర్ ఈస్ట్ సైడ్‌లోని తన ఇంటిలో సోమవారం తెల్లవారుజామున మేరియన్ మరణించినట్లు గార్డియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మేరియన్ మృతికి అసలు కారణాలు తెలియరాలేదు.
ఫ్రెడ్ ట్రంప్ మరియు మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్‌లకు నలుగురు పిల్లలు కాగా.. మేరియన్ ట్రంప్ బారీ మూడో సంతానం. న్యూజెర్సీలో ఫెడరల్ న్యాయమూర్తిగా పని చేసిన మేరియన్.. 2019లో పదవీ విరమణ పొందారు. 1974లో అసిస్టెంట్ యూస్ అటార్నీగా తన వృత్తిని ఆమె ప్రారంభించారు. తమ్ముడు డొనాల్డ్ ట్రంప్‌తో మేరియన్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. గతేడాది మేరియన్ సోదరడు రాబర్ట్ ట్రంప్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.