అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య ఈ టీ వల్ల వివాదం చెలరేగింది. యూఎస్ కు చెందిన ఓ ప్రొఫెసర్ టీ ఎలా తయారు చేయాలో చెబుతూ చేసిన సూచన బ్రిటన్ వాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. తాజాగా, యూఎస్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు.
షేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్ కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది.
అమెరికా- దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాల చేయడంతో నార్త్ కొరియాకు కోపం తెప్పించింది. దీంతో సౌత్ కొరియా- జపాన్ మధ్య గల సముద్రగర్భంలో అణు దాడి చేసేందుకు అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించింది.
అమెరికా గాయని మేరీ మిల్బెన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2024లో భారత్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని జోస్యం చెప్పింది.
America: ప్రస్తుతం డబ్బు ప్రపంచాన్ని శాసిస్తోంది. దాని కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు. అలాంటిదే ఓ కూతురు తన తల్లిని డబ్బు కోసం చంపిన ఉదంతం అమెరికా నుంచి వెలుగులోకి వచ్చింది.
ఆరోజుల్లో డబ్బులు తెలియవు.. రెక్కాడితే కానీ డొక్కాడవు.. అలాంటిది ఇప్పుడు కరెన్సీ విలువ పెరిగిపోయింది.. ఒక్కో దేశానికీ ఒక్కో రకమైన కరెన్సీ నోట్లు ఉంటాయి.. దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.. కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు..…
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ బయోటెక్ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.