ప్రపంచవ్యాప్తంగా రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- హమాస్ దేశాల మధ్య యుద్ధం బీభత్సంగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం వల్ల సదరు దేశాలపై ఆర్థిక భారం పెరుగిపోతుంది.
ఎర్ర సముద్రంలో మరో వాణిజ్య నౌకపై గురువారం నాడు హౌతీ తిరుగుబాట దారులు దాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై రెండు బాలిస్టిక్ క్షిపణులను యెమెన్‌లోని హూదేదా నుంచి రెబల్స్ ప్రయోగించినట్లు తెలిపింది.
అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్డేట్ వచ్చింది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ రోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యూఎస్ కాంగ్రెస్‌కు తెలియజేస్తుంది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 26 వేల మందికి పైగా మరణించారు. గాజా- ఇజ్రాయేల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మధ్యవర్త్వం వహిస్తున్నారు.
వీసాల జారీలో కొర్రీలు పెట్టే అగ్రరాజ్యం.. ఈసారి మాత్రం భారతీయులకు వీసాలు వచ్చే విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఏకంగా రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్‌కు చెందిన విద్యార్థి యూఎస్‌లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
ప్రపంచంలోనే ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఖైదీకి వినూత్న రీతిలో మరణశిక్ష అమలకు అమెరికా శ్రీకారం చుట్టింది. తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఓ దోషికి మరణశిక్ష అమలు చేసింది. హత్య కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. స్మిత్‌కి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని అమెరికాలోని అలబామా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జైలు అధికారులు నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి స్మిత్‌కు మరణశిక్ష అమలు చేశారు. నైట్రోజన్…