America: అమెరికాలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామా సిటీలో ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జూన్ 22న రాత్రి 10 గంటలకు జరిగింది. హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తి హేమంత్ మిస్త్రీని బెదిరించాడు. ఆస్తిని విడిచిపెట్టమని కోరినప్పుడు అంగీకరించకపోవడంతో మిస్త్రీ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. పంచ్‌ల కారణంగా మిస్త్రీ అపస్మారక స్థితికి చేరుకున్నారని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. దీని తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను జూన్ 23 రాత్రి 7.40 గంటలకు మరణించాడు.
Read Also: Nepal: నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 20 మంది మృతి
కాగా ఓ హోటల్‌లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ప్రస్తుతం ఓక్లహామా కౌంటీ జైలులో ఉంచారు. కాగా నిందితుడిని హోటల్ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని ఎందుకు అడిగారో తెలియరాలేదని, దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా హేమంత్ మిస్త్రీ గుజరాత్‌కు చెందినవారని తెలిసింది.