AMERICA: “మీరు పోర్న్ స్టార్‌తో సంబంధం పెట్టుకున్నారు.” ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బైడెన్
- ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు
- ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొనసాగిన పోటీలో నిలిచిన నేతల మధ్య చర్చ
- ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగిన వైనం
- పోర్న్ స్టార్ విషయంలో ట్రంప్‌ను కార్నర్ చేసిన బిడెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. అధ్యక్షుడు జో బిడెన్ (డెమొక్రాటిక్ పార్టీ) మరియు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)ల మధ్య డిబెట్ కొనసాగింది. వీరు ప్రత్యక్షంగా డిబెట్ కి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం, జాతీయ భద్రత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-గాజా యుద్ధం, పన్ను వ్యవస్థ, చైనాతో సంబంధాలు, ఇమ్మిగ్రేషన్ విధానం వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. జో బిడెన్ చైనా నుంచి డబ్బులు పొందారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. పోర్న్ స్టార్ విషయంలో బిడెన్ ట్రంప్‌ను కార్నర్ చేశారు. “మీ భార్య గర్భవతి అయినా.. మీరు పోర్న్ స్టార్ తో సబంధం పెట్టుకున్నారు.” అని బైడెన్ ట్రంపును నిలదీశారు. దీనికి సమాధానంగా ట్రంప మాట్లాడుతూ..తనకు ఏ పోర్న్ స్టార్‌తోనూ సంబంధాలు లేవని.. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
READ MORE: Jagga Reddy: రానున్న పదేళ్లలో పీసీపీ అవుతా.. సీఎం కూడా అవుతా..
Also Read
కాగా.. ఇప్పటివరకు తమ తమ పార్టీల్లో నిర్వహించిన డిబేట్లలో పాల్గొని విజయం సాధించిన ఈ ఇద్దరు నేతలు తొలిసారిగా డిబేట్లలో ప్రత్యక్షంగా ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డిబేట్‌లో తన దూకుడు ప్రదర్శించారు. మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ మాత్రం కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో ఇప్పుడు జో బైడెన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిబేట్‌లో ట్రంప్‌ను సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో సొంత పార్టీ నుంచే జో బైడెన్‌ను అసంతృప్తి వ్యక్తం అవుతోంది. బైడెన్ తీరుపై డెమోక్రాట్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!