అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అధికారం దక్కించుకునేందుకు కలలు కంటున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఊబలాటపడుతున్నారు.
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో జరిగిన కవాతులో కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒకరు మరణించగా కనీసం 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
కొత్త వ్యాధులు నిరంతరం పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులకు కారణమవుతున్నాయి. వ్యాధి నిజానికి, కెనాయి ద్వీపకల్పంలో అంటు వ్యాధితో ఒకరు మరణించిన వార్త వెలుగులోకి వచ్చింది.
US Led Attack : యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ జరిపిన వైమానిక దాడిలో 17 మంది హౌతీ యోధులు మరణించారు. యెమెన్ రాజధాని సనాలో అంత్యక్రియల అనంతరం యెమెన్ తిరుగుబాటు బృందం మీడియాతో మాట్లాడారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారిపై వరుసగా దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.…
అమెరికా (America) తుపాకీ కల్చర్ ఇండియాకు పాకినట్లుగా కనిపిస్తోంది. గురువారమే ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఓ శివసేన నేత తుపాకీ బుల్లెట్లకు బలైపోయాడు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా ఓ సెలూన్ షాపులోకి (Hair Salon) అగంతకులు ప్రవేశించి అతి సమీపం నుంచి తలకు గురి పెట్టి కాల్చడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికులు.. పోలీసులు ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.…
అమెరికాలో (America) ఇటీవల వరుసగా జరిగిన ఘటనల్లో ఐదుగురు భారత విద్యార్థుల (Indian Students ) మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.