Plane Hijack: విమానం హైజాక్‌కు యత్నం.. ప్రయాణికుడి కాల్పుల్లో దుండగుడు హతం
- అమెరికాలో విమానం హైజాక్‌కు యత్నం
- ప్రయాణికుడి కాల్పుల్లో దుండగుడు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఒక వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికుడి అప్రమత్తమై తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌తో కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెలీజ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: CMF Buds 2: నాయిస్ క్యాన్సిలేషన్ నియంత్రణ, 55 గంటల బ్యాటరీ లైఫ్ తో రాబోతున్న నథింగ్ ఈయర్ బడ్స్
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
బెలీజ్‌లో ట్రాపిక్ ఎయిర్‌కు చెందిన చిన్న విమానం గాల్లోకి ఎగిరింది. శాన్‌పెడ్రోకు విమానం వెళ్తోంది. ఇంతలో ఒక ప్రయాణికుడు ఉన్నట్టుండి కత్తితో హంగామా సృష్టించాడు. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కత్తితో దాడి చేయడంతో ముగ్గురు ప్రయాణికులు గాయాలు పాలయ్యారు. దీంతో మిగతా వారంతా భయాందోళనకు గురయ్యారు. మరో ప్రయాణికుడు అప్రమత్తమై తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. అంతే అక్కడికక్కడే దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. దుండగుడు అకిన్యేలా సావా టేలర్(49)గా గుర్తించారు.
విమానంలో మొత్తం 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దుండగుడి చర్యతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఇక కాల్పులు జరిపిన ప్రయాణికుడిని పోలీసులు ‘హీరో’గా అభివర్ణించారు. దుండగుడి చర్యతో విమానం రెండు గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం సేఫ్‌గా విమానం ల్యాండ్ అయింది.
ఇక దుండగుడు విమానం లోపలికి కత్తి ఎలా తీసుకెళ్లాడనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తి దాడిలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు. తోటి ప్రయాణికుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని పేర్కొన్నారు. నిందితుడు అమెరికా పౌరుడేనని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Trump-Meloni: ట్రంప్‌తో మెలోనీ భేటీ.. సుంకాలపై కీలక చర్చ
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!