Road Accident: టెక్సాస్‌లో గుంటూరు విద్యార్థిని మృతి.. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా..!
- టెక్సాస్‌లో గుంటూరు విద్యార్థిని మృతి
- రోడ్డుపై నడిచివెళ్తుండగా ఢీకొట్టిన కారు
- చికిత్స పొందుతూ కన్నుమూసిన దీప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందింది. టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి (23) మృతి చెందింది. స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచివెళ్తుండగా వేగంగా వచ్చి కారు దీప్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని పడింది. శనివారం నాటికి దీప్తి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో నెల రోజుల్లో చదువు పూర్తవుతుందనగా దీప్తి మరణించడం ఆమె కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.
గుంటూరు రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటున్న హనుమంతరావు, రమాదేవి దంపతుల పెద్ద కుమార్తె దీప్తి. పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్‌లో దీప్తి టాపర్‌గా నిలవడంతో.. తల్లిదండ్రులు పొలం అమ్మి అమెరికా పంపారు. కొన్నాళ్ల క్రితం యూఎస్ వెళ్లిన దీప్తి.. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేస్తోంది. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. ఏప్రిల్ 12న స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి దీప్తి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయాలు కాగా.. స్నిగ్ధకు సైతం గాయాలయ్యాయి.
Also Read
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
Also Read: MI vs SRH: మెరిసిన జాక్స్, రికిల్‌టన్.. సన్‌రైజర్స్‌పై ముంబై విజయం! ప్లేఆఫ్స్ రేసులో ఎంఐ
దీప్తి ఫ్రెండ్స్ ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు చెప్పగా.. మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో సంప్రదించారు. అమెరికాలో ఉన్న పెమ్మసాని విషయం తెలుసుకుని.. తన బృందాన్ని అప్రమత్తం చేసి దీప్తికి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. చికిత్స పొందుతూ ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!