కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రపంచంలోని చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ధనిక దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేనప్పటికీ కొన్ని చోట్ల వేగంగా సాగడంలేదు. జులై 4 వరకు అమెరికాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. 2020 డిసెంబర్ 14 వ తేదీన అమెరికాలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో వేగంగా కొనసాగినా మధ్యలో కొంతమేర మందగించింది. దీంతో అధ్యక్షుడు జో బైడెన్…
అమెరికా కరోనా నుంచి కోలుకున్నాక మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునేందుకును సిద్ధం అవుతున్నది. దేశంలో మౌళిక వసతుల రూపకల్పనకు రూ.75 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌కు సెనెట్‌కు ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది. దేశంలో మౌళిక వసతుల రూపకల్పన జరిగితే, అమెరికాలో దశాబ్దకాలం పాటు ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సెనెట్‌లో ప్రస్తుతం పాథమిక ఆమోదం మాత్రమే పొందింది. అయితే, దీనికి ఇంకా తుది ఆమోదం లభించాల్సి ఉన్నది. ప్రస్తుతం సెనెట్‌లో రిపబ్లకన్లు-డెమోక్రాట్లకు…
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో ఆ మధ్య వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కన్పించినా.. గత కొన్ని రోజులుగా మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో 24 గంటల వ్యవధిలో 88 వేల 376 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవడం ఇదేసారి. కరోనా టీకా పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం…
కరోనా సెకండ్ వేవ్ నుంచీ ఇంకా దేశం పూర్తిగా కొలుకోలేదు. చాలా రంగాల్లో పనులు మొదలైనప్పటికీ థియేటర్లు మాత్రం మూతపడే ఉంటున్నాయి. కాకపోతే, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు ప్రధానమైన మార్కెట్లు… ముంబై, ఢిల్లీ నగరాలు. ఈ రెండూ చోట్లా ఇంత కాలం థియేటర్లు తెరుచుకోలేదు. కానీ, ప్రస్తుతం దేశ రాజధానిలో 50 శాతం ప్రేక్షకులతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఆర్దిక రాజధాని ముంబైలో మాత్రం బిగ్ స్క్రీన్స్ ఇంకా వెలవెలబోతున్నాయి. ముంబై మార్కెట్లో సినిమా విడుదల…
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిమాండ్‌కు అనుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్లు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా మనదేశంలో స్మార్ట్ఫోన్లు వాడేవారి సంఖ్య జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాపారాలు ఎక్కువ అవ్వడం, విద్యార్థుల ఆన్లైన్ క్లాసులతో మొబైల్స్ అమ్మకాలు మరింత ఎక్కువ…
ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం వాక్సినేషన్.. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు టీకాలను ప్రోత్సహించడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. అయితే అమెరికా కొలరాడో రాష్ట్రం వ్యాక్సినేషన్‌ను ప్రోత్సాహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ లాటరీని ప్రవేశపెట్టింది. కాగా, తాజాగా లక్కీ లాటరీ డ్రా పేర్లను అనౌన్స్ చేయగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. హైడీ రెస్సెల్ అనే మహిళను విజేతగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు.…
‘అలా అమెరికాపురములో’… థమన్ తన టీమ్ తో సందడి చేయబోతున్నాడు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వరుస కచేరిలతో ఎన్నార్ లను అలరించనున్నాడు. ఇటువంటి మ్యూజికల్ టూర్స్ బాలీవుడ్ సంగీత దర్శకులు, గాయకులకు మామూలే. మన వాళ్లు చాలా తక్కువగా విదేశాల్లో మ్యూజికల్ కన్సర్ట్స్ ప్లాన్ చేస్తుంటారు. పైగా గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న కరోనా కల్లోలం పరిస్థితుల్ని మరింత కఠినతరంగా మార్చేసింది. అయినా, యూఎస్ లో నెలకొంటోన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా త్వరలోనే…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా రజనీ అమెరికాలోని తన స్నేహితులలో కలిసి ఖుషిఖుషీగా మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రజనీ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రజనీ అమెరికాలోని అత్యుత్తమైన మాయో క్లినిక్‌లో ఇటీవల…
డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నది. ఈ వేరియంట్ ఇప్పటికే 80కి పైగా దేశాల్లో విస్తరించింది. మాములు మామూలు సార్స్ కోవ్ 2 వైరస్ కంటే ఈ డెల్టా వేరియంట్ ప్రమాదకారి అని, వేగంగా విస్తరించే తత్వం కలిగి ఉన్నట్టు అమెరికా అంటువ్యాధున నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌసీ తెలిపారు. ఈ వ్యాధి తీవ్రతకు కూడా ఈ వేరియంట్ ఒక కారణం అవుతుందని డాక్టర్ ఫౌసీ తెలిపారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరు వేయించుకోవాలని, ప్రస్తుతానికి…
అమెరికాలో తుఫాన్ తాకిడితో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలబామా ప్రాంతంలో తుఫాను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో గ్రీన్విల్లే నగర సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో కనీసం 15 కార్లు చిక్కుకొన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ వచ్చిన వరదలు, టొర్నడోలు చాలా ఇళ్లను ధ్వంసం చేశాయని అధికారులు వివరించారు. ఈ…