Russia – Ukraine War : రష్యాకు యూరోపియన్ యూనియన్ షాకిచ్చింది. దీర్ఘకాలంగా ఉక్రెయిన్ దేశంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా విషయంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించే తీర్మానానికి యూరోపియన్ పార్లమెంటు మద్దతు పలికింది. ఉక్రెయిన్‌లో పౌరులే లక్ష్యంగా స్కూళ్లు, దవాఖానలు, విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడుతున్నదని, ఇది అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ తీర్మానంపై ఐరోపా పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించింది. ఇందుకు 494 మంది సభ్యులు మద్దతు పలికారు. 58 మంది వ్యతిరేకించగా.. మరో 44 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా దేశాలను ఉగ్రవాద ప్రోత్సాహక దేశాల జాబితాలో చేర్చిన అమెరికా.. రష్యాను మాత్రం ఆ జాబితాలో చేర్చేందుకు నిరాకరించింది. అయితే, యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఓటింగ్ నిర్వహించి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.
EP Plenary has 🗳️voted and declared 🇷🇺 Russia a state sponsor of terrorism
🎥Watch & download the video of the vote: https://t.co/rtimidIhST pic.twitter.com/QGfwl6u9pt
— European Parliament Audiovisual Service (@europarlAV) November 23, 2022