Ghost Detector : సైన్స్ ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నేటికీ చాలమంది దెయ్యాలను నమ్ముతారు. పారానార్మల్ యాక్టివిటీ కోరుకునేవారు.. హాంటెడ్ ప్రదేశాలు, తృప్తి చెందని ఆత్మలను ట్రాక్ చేస్తూ ఉంటారు. డిస్కవరీ ఛానెల్‌లో అలాంటి వ్యక్తుల వాదనలు.. కథనాలను ఇప్పటి వరకు మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు దెయ్యాలను గుర్తించే పరికరం అమెజాన్(Amazon)లో విరివిగా అమ్ముడవుతోంది. ఈ పరికరంతో దెయ్యాల పని పట్టవచ్చంటున్నారు. దీనిని చాలమంది కొనుగోలు చేస్తున్నారు. ఈ పరికరం ఎలా పనిచేస్తుందో చూద్దాం..
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లలో సాధారణంగా విక్రయించబడే ‘ఘోస్ట్ డిటెక్టర్ పరికరం’ వాస్తవానికి EMF డిటెక్టర్ (ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్). విద్యుదయస్కాంత తరంగాలు అధికంగా ఉండే ఈ పరికరం సహాయంతో దెయ్యాలున్న స్థలాన్ని కనిపెట్టవచ్చు. ఈ యంత్రం నిమిషాల వ్యవధిలో తన పనిని సంపూర్ణంగా చేస్తుంది. విద్యుదయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉన్న చోట పరికరంలోని ముల్లు మలుపు తీసుకుంటుంది. సైన్స్ రంగంలో చాలా మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం ఇటువంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ యంత్రాన్ని ‘పారానార్మల్ యాక్టివిటీ’ కోసం ఉపయోగిస్తున్నారు. అంటే ఆత్మలు, దెయ్యాలున్న స్థలాల కోసం వెతుకుతున్న వ్యక్తులు ఇప్పుడు ఈ యంత్రాన్ని వారి అన్వేషణకు ఉపయోగిస్తున్నారు.
Read Also: Das Ka Dhamki : దాస్ ‘ధమ్కీ’ ఇస్తాడని వస్తే రవితేజ ‘ధమాకా’ చూపించాడు
‘ఘోస్ట్ డిటెక్టర్’ పేరుతో ఆన్‌లైన్ విక్రయాలు
దెయ్యాలు సంచరించే చోట విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కొందరు నమ్ముతారు. కాబట్టి మీ వద్ద ఈ యంత్రం ఉంటే, దాన్ని హాంటెడ్ ప్రదేశాలకు తీసుకెళ్లి అక్కడ విద్యుదయస్కాంత క్షేత్రం ఉందో లేదో తెలుసుకోవచ్చు. అందువల్ల, విద్యుదయస్కాంత క్షేత్రం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఈ విషయాలను విశ్వసించరు. పారానార్మల్ నిపుణులు ఈ పరికరం సహాయంతో దెయ్యాల కోసం వెతుకుతున్నారు. అందుకే ఆన్ లైన్ లో ‘ఘోస్ట్ డిటెక్టర్ ’ పేరుతో ఈ యంత్రాన్ని విక్రయిస్తున్నారు. వాస్తవానికి, ఈ పరికరం విద్యుదయస్కాంత క్షేత్రాలను గుర్తించడానికి మాత్రమే రూపొందించబడింది. అమెజాన్‌లో ఈ డివైజ్‌ని 2 నుంచి 5 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు.
Read Also: Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్