రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించే భూముల విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ.. పలు భూ కేటాయింపులపై ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది..
ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు..
నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారు.. మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు - మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
Minister Kondapalli: విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణానికి నాంది పలకడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా రాజధాని విషయంలో వెనకబడి ఉన్నాం.. గత పాలకులు రాజధానిని నిర్వీర్యం చేశారు.
Ambati Rambabu: అమరావతి పునః ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి ఒక అంతులేని కథ.. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు అని మండిపడ్డారు.
విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో తాను పాల్గొంటానని, తనను ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలన్నారు. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదని, ఆ కలల్ని నిజం చేసే వారి సంఖ్యా తక్కువ కాదన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారని, ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని, ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించానని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అమరావతి పునఃనిర్మాణ పనులకు…
రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదనేది మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అలాగే, ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయని ప్రధాని మోడీ అన్నారు.
అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం వెలగపూడిలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచే 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు, రూ.8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ప్రధాని…