ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్ట్లకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది.
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి మే 2న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని సభ జరిగే ప్రాంతాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించగా.. తాజాగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని రాక సందర్భంగా 6 వేల మందితో…
జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు.. అంతే కాదు జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ జిల్లా అధ్యక్షులపై కీలక బాధ్యతలు మోసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తూ.. కీలక సూచనలు చేశారు..
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా.. వారి సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..
ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందే ఎస్పీజీ రంగంలోకి దిగింది.. అమరావతి చేరుకున్న ప్రధాని మోడీ భద్రతా దళం.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి.. మోడీ టూర్ సాగే రూట్లలో ప్రయాణిస్తూ.. ప్రత్యేకంగా పరిశీలించింది SPG.. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.. భద్రతా ఏర్పాట్లను SPGకి వివరించారు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ అధికారులతో…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ.. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ..
అదనపు భూ సేకరణ వల్ల భూమి విలువ పడిపోతుందనే అపోహలు వద్దు అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మేలు ఎప్పటికీ మర్చిపోలేం అన్నారు. రాజధాని పరిధిలో గ్రామ కంఠాల్లో ఉంటూ పట్టాల్లేని వారికి త్వరలోనే పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం అయ్యారు. ఏ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పర్యటనకు రైతులను ఆహ్వానించారు. రాజధాని మరలా అభివృద్ధి బాట…
రాబోయే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.. రానున్న మూడు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ పేర్కొన్నారు..