మాజీ సీఎం, ఏపీలో విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని ఓర్వలేక చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ అంశంపైనైనా అంతా మోసమే చేశారన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఐదేళ్ళలో 20వేల కోట్లు మాత్రమే పెట్టుబడులుగా వచ్చాయన్నారు. కడప, తిరుపతిలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు.
అమరావతిలో డ్రైనేజీ నుంచి మంచినీళ్ళ వ్యవస్థ కూడా లేదు. 10వేల కోట్లు ఖర్చు పెట్టాం అని చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. కనీసం ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయకుండా 10 వేలు ఎలా ఖర్చు అయ్యాయి. ఈ డబ్బులతో మూడు రాజధానులు నిర్మించగలిగే పరిస్థితి వుండేది. తాను ఉంటున్న ఇంటికి కూడా డ్రైనేజీ లేకపోవడంతో నదిలోకే మురికి వదిలేస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం యాత్రకు వందల కోట్లు చందాలు వసూలు చేయటం ఏంటి?
విజన్ ఉన్న నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం ఎందుకు కనిపించలేదు. 10వేల కోట్లతో ఎంత అభివృద్ధి చేయవచ్చు. కరోనా లేని ఐదేళ్ళ కాలంలో వచ్చిన పెట్టుబడులు గురించి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. మా రెండున్నరేళ్ల కాలంలో అందులో నూ కరోనా సమయంలో ఇప్పటికే 40వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎందుకు అంత ద్వేషం? పోలవరాన్ని, అమరావతిని నాశనం చేసింది చంద్రబాబు కాదా అన్నారు. ఇప్పుడు మా పై దాడి చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన ప్రతి అంశానికి ఆధారాలతో సమాధానం చెప్పటానికి సిద్ధం గా ఉన్నా…. చంద్రబాబు కు ధైర్యం ఉందా? చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి. తన ఐదేళ్ళ పాలన పై తనకు నమ్మకం ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి. ఎన్టీఆర్ ను తానే చంపేసి ఇప్పుడు ఎవడో తాగుబోతు వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో స్వయంగా ఒక ఐపీఎస్ టీడీపీలో చేరండి అని అడిగేవాడు. ఈ వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసు కూడా నడిపే వాడు. ఐపీఎస్ లను ఈ స్థాయికి దిగజార్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు శ్రీకాంత్ రెడ్డి.