ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం…
మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు. పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం…
ఏపీలో ఉప ఎన్నిక మాటున నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీపీఐ అగ్రనేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జగన్ పోటీచేయాలన్నారు నారాయణ. 900 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు సానుకూలంగా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి వితండ వాదన చేస్తుండడం దారుణంగా వుందన్నారు. ఆనాడు అమరావతిలో రాజధానిని అంగీకరించారు. ప్రతిపక్షనేతగా ముందు అంగీకరించి ఇప్పుడు ఆడినమాట తప్పుతారా..? మోడీ కాళ్లు మోక్కినంత మాత్రాన జైలుకు పోకుండా ఎవరైనా ఆపగలరా..?ఆత్మకూరులో…
ప్రకాశం జిల్లాలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది. మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నేతలు. ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టారు నేతలు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. కష్టాలల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ధూళిపాళ నరేంద్ర. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర.…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ…
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్టేనా..? మహమ్మారి మాయం అయినట్టేనా? అంటే ఇప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నే.. అయితే, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.. ఎందుకంటే..? ఈరోజు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు.. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు…