ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం సురేష్ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అంశాల్లో పోరాడిన నందిగం సురేష్ జీవిత ఘట్టాలు ఈ బయోపిక్ లో వుండనున్నాయి. వైసీపీలో అనూహ్యంగా గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన నందిగం జీవితం యువతకు స్ఫూర్తిగా వుంటుందని భావిస్తున్నారు.
నేనొక సామాన్యుడిని అలాంటిది జగన్ మోహన్ రెడ్డి నన్ను ఎంపీని చేశారు.ఇది దళితులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా.ప్రజల కోరిక మేరకు నా జీవిత చరిత్రను బాపట్ల ఎంపి టైటిల్, క్యాప్షన్ నందిగం సురేష్ పేరుతో సినిమా నిర్మిస్తున్నాం అన్నారు ఎంపీ నందిగం సురేష్. నెల రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తాం.
టీడీపీ చేసిన అకృత్యాలు వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలపై సినిమా కథ ఉంటుందన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం పై సినిమా నిర్మాణం జరిగిందని వివరించారు. నాలాంటి సామాన్యులకు జగన్ అండగా నిలుస్తున్నారని ఎంపీ సురేష్ కొనియాడారు.
Rana Daggubati: నాకూ ఫ్యాన్స్ ఉంటారని తెలియదు.. ఇక ఆ సినిమాలు చేయను