TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం పట్టు వస్ర్తాలను సమర్పిస్తారు. భక్తులు రద్ది తగ్గే వరకు సర్వదర్శన భక్తులుకు ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తాం అన్నారు. సర్వదర్శన భక్తులకు స్లాటడ్ విధానంలో టోకేన్లు కేటాయింపు పై అధ్యయనం కొనసాగుతుందన్నారు సుబ్బారెడ్డి.
దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది పాలకమండలి. ఆగస్ట్ 16 నుంచి 20వ తేది వరకు నెల్లూరులో వైభోత్సవాలు నిర్వహిస్తాం. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పసుగ్రాసం కోనుగోలు చేయాలని, 2.7 కోట్లతో పార్వేటి మంటపం నూతన నిర్ణయం చేస్తామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేస్తారు. 2.9 కోట్లతో అమరావతిలో ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ది చేయనున్నారు. తిరుమలలోని యస్వీ పాఠశాలలో ఉన్నతప్రమాణాలతో విద్యను విద్యార్దులకు అందించేందుకు సింఘానియా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది.
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మార్పులు..
18 లక్షలతో బేడి ఆంజనేయస్వామి కి బంగారు కవచం ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైలో రూ.6 కోట్లు,బెంగళురులో రూ.3.23 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా భక్తులు అందించారు. ఈ ఏడాది 33 లక్షల క్యాలండర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రిక ముద్రణ చేస్తున్నామన్నారు. యంత్రాల సాయంతో లడ్డు ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం చేసుకున్నాం. ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగమపండితులు సలహ మేరకు నెల రోజులు తరువాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేయనుంది. అక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా 7 కోట్లు కేటాయించాం అని తెలిపారు.
President Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మూకే టీడీపీ మద్దతు
తాజావార్తలు
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!