ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది వర్షాకాలానికి శుభారంభం లభించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. ఆ రాష్ట్రంలో గత నెలలో సాధారణం కన్నా 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వివరాలను అమరావతిలోని వాతావరణ విభాగం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు. సాధారణంగా 94.1 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులు 105.7 మిల్లీమీటర్లు రికార్డయిందని చెప్పారు. జిల్లాల వారీగా చూసుకుంటే వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 129.5 మిల్లీ మీటర్ల వర్షం పడిందని తెలిపారు.
సాధారణంగా 68 మిల్లీ మీటర్లే కురవాల్సింది. 90 శాతం ఎక్కువ నమోదైంది. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 76.9 మిల్లీ మీటర్లే పడింది. ఇది సాధారణం కన్నా 38 శాతం తక్కువ కావటం గమనార్హం. వాన సర్‌ప్లస్‌గా కురిసిన జిల్లాల జాబితాలో అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి కూడా ఉన్నాయి. అనంతపురంలో 75, చిత్తూరులో 59, తూర్పు గోదావరిలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తక్కువ వాన పడ్డ జిల్లాల లిస్టులో గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 33 శాతం చొప్పున, శ్రీకాకుళంలో 28 శాతం తక్కువ వర్షపాతం రికార్డయింది. విశాఖలో సాధారణంగా 141.7 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సింది. కానీ 13 శాతం తక్కువ నమోదైంది. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఎల్లుండి అల్ప పీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది.
Special Train:ఈ రైలు ‘రూటే’ సెపరేటు.. దటీజ్ వివేక్ ఎక్స్‌ప్రెస్