అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా…
CS Sameer Sharma Falls Sick: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. వెంటనే ఆయన్ను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు.. అయితే, సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు.. ఇటీవలే హైదరాబాద్లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల నుంచి విధులకు…
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17…
ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించారు.. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ 2022 అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల ప్రక్రియ చేపట్టింది.. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను గుర్తించి సత్కరించటం దీని ప్రధాన ఉద్దేశ్యం అన్నారు.. మన సంస్కృతి, సంప్రదాయాలను వైఎస్సార్ ఒక ప్రతీకగా నిలబడ్డారు.. ఇదే కోవలో సంస్కృతి, సంప్రదాయాలు,…