AP CID: ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. చంద్రబాబును ఏ1గా చేర్చిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను చేర్చింది సీఐడీ.. వారిపై 120బీ, 420, 34, 35, 36, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ధి కల్గించారని ఆరోపించారు.. కాగా, 454 కిలోమీటర్ల పాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించాలని తలపెట్టారు…. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చిక్కుకుంటుంది.. అలైన్‌మెంట్, భూసేకరణ.. లాంటి అంశాలకు వివాదానికి కారణంగా మారిపోయాయి.
Read Also: Massoda Movie Review: మసూద
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
మరోవైపు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో విచారిస్తున్నారు ఏపీ సీఐడీ పోలీసులు.. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 11.30 నుండి విచారణసాగుతోంది.. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపై ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నోటీసు ఇచ్చింది సీఐడీ.. కాగా, నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరు కాలేరంటూ హైకోర్టుకి తెలిపారు నారాయణ తరుపు న్యాయవాదులు.. ఇక, హైకోర్టు నారాయణను ఇంట్లో విచారించవచ్చు అని చెప్పడంతో ఇవాళ ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు విచారిస్తోంది సీఐడీ బృందం.. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నారాయణ నివాసం ఉంటుంటున్నారు.. అక్కడికే వెళ్లి ప్రశ్నిస్తున్నారు సీఐడీ పోలీసులు.
తాజావార్తలు
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!