అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి… ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. రైతులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు.. తాము ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని రైతులకు తేల్చి చెప్పింది న్యాయస్థానం.. ధర్మాసనం ఇచ్చిన షరతులకు లోబడే పాదయత్ర జరగాలని స్పష్టం చేసింది.. పాదయాత్రలో పాల్గొనకుండా మరే రకంగా అయినా సంఘీభావం తెలపొచ్చు అని సూచించింది.. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులు వచ్చినప్పుడు చూపించాలని రైతులకు ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.. మరోవైపు.. పాదయాత్ర రద్దు చేయాలంటూ డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది హైకోర్టు.
Read Also: Elon Musk: అందరికీ తెలిస్తే ఆయన ఎలాన్ మస్క్ ఎలా అవుతారు?
రైతులు హైకోర్టు ఇచ్చిన షరతులను మళ్లీ ఉల్లంఘిస్తే.. యాత్ర అనుమతులు ఉల్లంఘిస్తే.. అప్పుడు యాత్ర రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి స్పష్టం చేసింది… ఇదే సమయంలో కోర్టు ఆదేశాలను ఎట్టిపరిస్ధితులలో ఉల్లంఘించరాదని రైతులను హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కాగా, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని లాయర్లు కోరడం.. రైతులు 600 మంది మాత్రమే పాల్గొంటారని చెప్పిన పిటిషనర్లు, సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో ముందు, వెనకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని కూడా కోర్టుకు విన్నవించారు.. మొన్న వాదనలు ముగించి తీర్పు వాయిదా వేసిన హైకోర్టు.. ఇవాళ్ల తీర్పు వెలువరించింది.