CM Chandrababu: జమిలీపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికలు మాత్రం అప్పుడే..!
- జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు..
- జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే..
- ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: జమిలీ ఎన్నికలపై కేంద్ర వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది.. ఇప్పటికే కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఎల్లుండి పార్లమెంట్ ముందుకు రాబోతోంది జమిలీ ఎన్నికల బిల్లు.. అయితే, ఈ నేపథ్యంలో.. మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.
Read Also: Bihar: బీహార్‌లో మావోల దుశ్చర్య..? రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ఇక, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు సీఎం చంద్రబాబు.. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆయన.. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతీ చోటా దీనిపై చర్చ జరగాలన్నారు.. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి.. 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్నారు.. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుంది.. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్నారు.. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టం చేశారు..
Read Also: Allu Arjun Wife: భావోద్వేగానికి గురి అయిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఈ సారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తాం.. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా.. ప్రశ్నలు- సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తాం అని పేర్కొన్నారు.. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై అజెండా పంపి.. వాటిపై సమాధానాలు కోరతాం.. తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగటంతో పాటు మంత్రులు- అధికారుల మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుందన్నారు.. మరోవైపు.. ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాణీ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.. అద్వాణీతో నాకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉంది.. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎల్కే అద్వానీ సహకారం మరువలేనిది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!